వెతుకు

కథాలయం

An Abode For Fantastic Telugu Fiction

ట్యాగు

కథ

నేను తోలు మల్లయ్య కొడుకుని…

(రచన: ఎం. ఎస్. కె. కృష్ణజ్యోతి)

ఆదివారం పెద్దకూర పండగా, నాటుసార ఏడుకా గడిచిపోయాక సోమారం చెప్పుల దుకానం కాడ కూచోడం బలే కష్టమనిపిస్తది మారయ్యకి. కానీ తప్పదు. మళ్లీ వారమంతా అందరి కడుపు నిండి, వారం చివర కాసింత సరదా కావాలంటే వారమంతా ఈడ కూచుని ఎదురు చుడాలిసిందే. దుకానమంటే ఏమంత కాదుగానీ, నేలమీద రెండు గోనెలు, సుత్తీ, అరా, పెద్దసూదీ, దారం, అతికిచ్చే బంక ఇంకా నాలుగు జతల పాత చెప్పులు! ఓ చిన్న టార్పలిన్ షెడ్డు. అదీ వాన కాలం గాబట్టి ఓ మనిషి పట్టేంత చోట్లో ఎదురు కర్రలతో షెడ్డు ఏశాడు. చలికాలం ఆకాశం కిందనే. ఎండకి మాత్రం ఓ గొడుగేసుకుని నల్లని గొడుగు కింద మండతా వుంటాడు. అలవాటై పోయింది.

Continue reading ...

ప్రవల్లిక నిర్ణయం

(రచన: యాజి)

“చీకట్లో కూర్చున్నావేం?” అంటూ లైట్ స్విచ్ వేసి గదిలోకొచ్చిన రేవంత్, ప్రవల్లిక మొహం చూడంగానే, మళ్ళీ ఏమైందోనన్న ఆదుర్దాతో, సోఫాలో ఆమెపక్కనే కూర్చొని సాంత్వననివ్వటం కోసం తన చేతులు ఆమె భుజాల చుట్టూ వేసి దగ్గరకు తీసుకున్నాడు. కొంత సమయం తరవాత ప్రవల్లికే మాట్లాడటానికి పూనుకుంది.

“జెన్నీ అబార్షన్ చేయించుకుంటుందట!”

Continue reading ...

అహిగా

(రచన: సాయి బ్రహ్మానందం గొర్తి)

ఒక భారతీయ స్త్రీ చిన్న నేలబారు పీట మీద కూర్చొని స్నానం చేస్తున్న చిత్రం. గోడకి ఉన్న అద్దంలో అస్పష్టంగా ఆమె ముఖం; ముఖం కన్నా నుదిటి పైన మెరుస్తూ ఎర్రటి బొట్టు. వీపు మీద తడిసిన తెల్లటి వస్త్రంలో ఆమె వెనుక భాగం స్పష్టంగా ఉంది. పొడవాటి నల్లటి శిరోజాల అంచున ముత్యాల్లా రాలుతున్న నీటి చుక్కలు. ఓ మూలగా ఒక రంగుల సంతకం!

Continue reading ...

సరిహద్దు

(రచన: సాయి బ్రహ్మానందం గొర్తి)

రవీ కెరీదా,

ఎలా వున్నారు? మా స్పానిష్ భాషలో కెరీదా అంటే 'ప్రియమైన' అని. నాకు అమెరికాలో వున్న అతి కొద్దిమంది పరిచయస్తుల్లో "ప్రియమైన" అని సంబోధించడానికి ఆలోచించనక్కర్లేని వ్యక్తి మీరు. అమెరికాలో నేనంటూ గౌరవించే వ్యక్తుల్లో మీరు మొదటుంటారు.

Continue reading ...

తుపాకి

(రచన: ఎస్‌. నారాయణస్వామి)

ఎడంచెయ్యి స్టీరింగ్‌ కంట్రోల్‌ చేస్తూ కుడిచెయ్యి సీటు పక్కన దరువేస్తున్నాశంకర్‌ కళ్ళు మాత్రం నిశితంగా రోడ్డుని పరిశీలిస్తున్నై. “నాన్నా,” కిరణ్‌ పిలిచాడు. దరువాగి పోయింది కొడుకు పిలుపు వినబడగానే. కానీ కళ్ళు రోడ్డు మీదనుంచి మరల్చ కుండానే మొహం కొంచెం వెనక సీటు వేపుకు తిప్పి బదులిచ్చాడు శంకర్‌. “ఏంట్రా కన్నా?”

“నాకో తుపాకీ కావాలి.”

Continue reading ...

బ్రహ్మాండం

(అనువాదం: అనిల్ ఎస్. రాయల్)

నువ్వు ఇంటికి వెళుతుండగా జరిగిందది.

రహదారి ప్రమాదం.

అందులో పెద్ద విశేషమేమీ లేదు - నువ్వు చనిపోవటం తప్ప.

పెద్దగా బాధపడకుండానే పోయావు. ఒక భార్యని, ఇద్దరు పిల్లల్నీ వదిలేసి వచ్చేశావు. నిన్ను కాపాట్టానికి వైద్యులు శక్తికొద్దీ ప్రయత్నించారు. కానీ నీ శరీరం ఎంతగా నుజ్జైపోయిందంటే - నువ్వు బతికుండటం కన్నా ఇదే మెరుగంటే నమ్ము.

అలా కలిశావు నువ్వు నన్ను. అదే మొదటిసారి కాదనుకో. కానీ ఆ సంగతి అప్పటికి నీకింకా తెలీదు.

Continue reading ...

కుంతీకుమారి

(అనువాదం: అనిల్ ఎస్. రాయల్)

(సమయం: 1985, నవంబర్ 7. రాత్రి 10:17 గంటలు. ప్రాంతం: న్యూ ఇండియా బార్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్)

బ్రాందీ గ్లాసు శుభ్రం చేస్తుండగా దానికి తగిలి ఖంగుమంది నా వేలికున్న ఉంగరం.

చేస్తున్న పని ఆపి దానికేసి చూశాను: వలయాకారంలో, తన తోకని తానే మింగుతున్న కాలసర్పం.

అప్పుడే తలుపు తెరుచుకున్న శబ్దమయింది. దృష్టి అటు మరల్చాను. కుంతీకుమారి బార్‌లోకి అడుగుపెడుతున్నాడు.

అతని వయసు పాతికేళ్లు. సరిగా నా ఎత్తుంటాడు. అనాకారి. ఆ ఆకారం నాకు నచ్చదు. కానీ అతని అవసరం నాకుంది. అందుకే అయిష్టత దాచిపెట్టుకుని అతనివైపో నవ్వు రువ్వాను. అతను తిరిగి నవ్వకుండా నేరుగా నేనున్న కౌంటర్ వద్దకే వచ్చి కుర్చీ లాక్కుని అందులో కూలబడ్డాడు.

తన గురించెవరన్నా ఆరా తీస్తే “నా పేరు కుంతి. నేనో పెళ్లికాని తల్లిని” అంటాడతను ముక్తసరిగా.

Continue reading ...

ప్రియ శత్రువు

(రచన: అనిల్ ఎస్. రాయల్)

"అమ్మూ, నిద్రపోయే వేళయింది .. రా"

"ఇంకాసేపు ఆకుంటా మమ్మీ"

"చాలాసేపు ఆడుకున్నావు, వచ్చేయమ్మా"

"ఊఁహు. నేన్లాను. ఇంకా ఆకుంటా"

లేదా, "వత్తా కానీ, మలి నాకో కత చెబుతావా?"

లేకపోతే, "మలేం .. జోల పాడతానంటేనే వత్తా"

మరికొన్ని ప్రత్యామ్నాయాలు ఆలోచించాక విసుగొచ్చి ఆపేశాను.

కుడిచెయ్యి గుంజుతోంది. దానికేసి చూశాను. మణికట్టు వద్ద బ్యాండేజ్. ఆ చేతికేమయిందో తెలీదు. ఈ ఆసుపత్రికెలా వచ్చిపడ్డానో కూడా తెలీదు. గుర్తు చేసుకోటానికి విశ్వప్రయత్నం చేశాను. జ్ఞాపకం రాలేదు; తలనొప్పి వచ్చింది.

Continue reading ...

రహస్యం

(రచన: అనిల్ ఎస్. రాయల్)

ఈ లోకం - లోపాలూ, లోటుపాట్లూ లేనిది కాదు. అందరూ కోరుకునేంత అందమైనదీ కాదు. నలుమూలలా నేరాలు, ఘోరాలు, అవినీతి, అరాచకత్వం.

ఇది ఇంతకన్నా దారుణంగా ఉండొచ్చు.

కానీ లేదు.

లోకం ఈ మాత్రమన్నా భద్రంగా ఉండటానికి వెనక ఎందరిదో శ్రమ దాగుంది. అకుంఠిత దీక్షతో తమ పని తాము చేసుకుపోయే పాత్రికేయులు, పోలీసులు, సైనికులు, సైంటిస్టులు, మరెందరో. వాళ్ల చర్యలు అనునిత్యం ప్రపంచాన్ని కాపాడే అదృశ్యహస్తాలు. వాళ్లలో కొందరి సాహసాలు చరిత్రలకెక్కే విజయాలు. కొందరి త్యాగాలు చీకట్లలో మగ్గే రహస్యాలు.

ఇది అలాంటి ఓ మనిషి గాధ.

Continue reading ...

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

Up ↑