వెతుకు

కథాలయం

An Abode For Fantastic Telugu Fiction

వర్గం

అతిధి కథలు

వాల్తేరత్త

(రచన: గొరుసు జగదీశ్వర రెడ్డి)

విజయనగరం దగ్గర్లోని కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ లో మా రెండో వాడికి సీట్‌ రావడంతో పాతికేళ్ళ తర్వాత మళ్ళీ ఇలా విశాఖపట్నం మీదుగా వెళ్ళబోతున్నందుకు గొప్ప థ్రిల్‌గా వుంది.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు బయల్దేరే ముందు కూడా అమ్మానాన్నలిద్దరు వంతపాడినట్లు, "రమణా... ఎట్లాగూ అంత దూరం వెళ్తున్నావు. తిరుగు ప్రయాణంలో నైనా విశాఖపట్నంలో దిగి వరాలత్త ఇంటికి వెళ్ళిరా," అంటూ మరీమరీ చెబుతూ, ఆ ఇంటి గుర్తులు కొన్ని చెప్పారు.

Continue reading ...

చీడ

(రచన: గొరుసు జగదీశ్వర రెడ్డి)

నా పేరు సంపంగి. ఎనిమిదేళ్ల క్రితం సింహాచలం నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. అడుగు ఎత్తులో మొక్కగా ఉండేదాన్ని. పదహారడుగుల మానుగా పెరిగాను.

ఇప్పుడు నా పూలని కోయాలంటే వంకీ కత్తి కట్టిన పెద్ద వెదురుబొంగు అవసరం మీకు. అదే నా చిట్టితల్లి వచ్చి, నా కింద నిల్చుని దోసిలి పట్టిందంటే జలజలమని పూలవర్షం కురిపిస్తాను. ఎందుకంటే చిట్టితల్లి మాకందరికీ ప్రాణం. నేను వచ్చిన కొత్తలో ఈ తోటంతా పచ్చగా కళకళలాడేది. నాతోపాటు ఎన్నోరకాల పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉండేవి. ఇంటి ముందు నుండి ఎవరు వెళ్లినా, మా సౌరభాలకు మత్తెక్కినట్లు ఒక నిముషంపాటు నిల్చొని శ్వాస ఎగబీల్చి వెళ్లేవారు. విషాదమేమంటే- అలా ఆస్వాదించిన వాళ్లే రెండేళ్లుగా ఏదో కాలిన వాసన వేస్తున్నట్లు ముక్కుకు అడ్డుగా చేతిరుమాలు పెట్టుకొని గబగబ వెళ్లిపోతున్నారు.

Continue reading ...

ఊరవతల ఊడల మర్రి

(రచన: చందు తులసి)

"మనిషి పుట్టుక పుట్టిన తర్వాత కొంచెమన్నా సిగ్గూ రోషం ఉండాల. మాట మీద నిలబడాల. అప్పు తీసుకునేటపుడు తియ్యని ముచ్చట్లు ఎన్ని సెప్పావు. తీరా అప్పు కట్టమంటే మాత్రం పిట్టకథలు శానా సెపుతున్నావు. అంత సేత కాకపోతే ఎవరు నిన్ను అప్పు తీసుకోమన్నాడు? నేనేం నీ ఇంటికి కొచ్చానా? నువ్వే కదా పదిసార్లు నా ఇంటి చుట్టూ తిరిగావు! పోయినేడాది ఏమన్నావు? వచ్చే ఏడాది కడతా సేటూ అన్నావు. మరి కట్టావా? దొంగోని మాదిరి తప్పించుకొని తిరుగుతున్నావు. నిన్ను పట్టుకోవడం చానా కష్టమపోయింది"

Continue reading ...

నా నేల నాకు ఇడిసిపెట్టు సారూ …

(రచన: ఎం. ఎస్. కె. కృష్ణజ్యోతి)

మడిసి మట్టిలోంచి పుట్టాడని ఏదాంతం. అంకయ్యకి ఏదాంతం తెలవదు. మట్టిలోంచి మడిసి రావడం సంగతి పక్కనబెడితే ఆడికి పుడతానే మట్టితో లంకైపోయింది. మట్టిని పుట్టిన గడ్డిని కోసే కొడవలితో గూడా. ఎట్టంటావా?! అంకయ్య తల్లి లచ్చమమ్మ రేత్తిరేదో, పొద్దేదో దిక్కుతెలీని దానిలా పాటు చేస్తా వుండేది. నిండు సూలుతో గూడా దగ్గరనే గదాని పెనిమిటికి ఆన్నం ఇచ్చిరాను పొలానికి పోయ్యందా, ఆడ్నే నొప్పులొచ్చి బిడ్డ జారి బూమ్మీద పడిపోయిండు. ఏమ్మిటే చేతనున్న కొడవలితో ఆయమ్మే బొడ్డుతాడు కోసేసినాది. పురిటి బిడ్డని మొదులు చేతని పట్టుకున్న్న మంతరసాని మట్టితల్లే.

Continue reading ...

నేను తోలు మల్లయ్య కొడుకుని…

(రచన: ఎం. ఎస్. కె. కృష్ణజ్యోతి)

ఆదివారం పెద్దకూర పండగా, నాటుసార ఏడుకా గడిచిపోయాక సోమారం చెప్పుల దుకానం కాడ కూచోడం బలే కష్టమనిపిస్తది మారయ్యకి. కానీ తప్పదు. మళ్లీ వారమంతా అందరి కడుపు నిండి, వారం చివర కాసింత సరదా కావాలంటే వారమంతా ఈడ కూచుని ఎదురు చుడాలిసిందే. దుకానమంటే ఏమంత కాదుగానీ, నేలమీద రెండు గోనెలు, సుత్తీ, అరా, పెద్దసూదీ, దారం, అతికిచ్చే బంక ఇంకా నాలుగు జతల పాత చెప్పులు! ఓ చిన్న టార్పలిన్ షెడ్డు. అదీ వాన కాలం గాబట్టి ఓ మనిషి పట్టేంత చోట్లో ఎదురు కర్రలతో షెడ్డు ఏశాడు. చలికాలం ఆకాశం కిందనే. ఎండకి మాత్రం ఓ గొడుగేసుకుని నల్లని గొడుగు కింద మండతా వుంటాడు. అలవాటై పోయింది.

Continue reading ...

ప్రవల్లిక నిర్ణయం

(రచన: యాజి)

“చీకట్లో కూర్చున్నావేం?” అంటూ లైట్ స్విచ్ వేసి గదిలోకొచ్చిన రేవంత్, ప్రవల్లిక మొహం చూడంగానే, మళ్ళీ ఏమైందోనన్న ఆదుర్దాతో, సోఫాలో ఆమెపక్కనే కూర్చొని సాంత్వననివ్వటం కోసం తన చేతులు ఆమె భుజాల చుట్టూ వేసి దగ్గరకు తీసుకున్నాడు. కొంత సమయం తరవాత ప్రవల్లికే మాట్లాడటానికి పూనుకుంది.

“జెన్నీ అబార్షన్ చేయించుకుంటుందట!”

Continue reading ...

అహిగా

(రచన: సాయి బ్రహ్మానందం గొర్తి)

ఒక భారతీయ స్త్రీ చిన్న నేలబారు పీట మీద కూర్చొని స్నానం చేస్తున్న చిత్రం. గోడకి ఉన్న అద్దంలో అస్పష్టంగా ఆమె ముఖం; ముఖం కన్నా నుదిటి పైన మెరుస్తూ ఎర్రటి బొట్టు. వీపు మీద తడిసిన తెల్లటి వస్త్రంలో ఆమె వెనుక భాగం స్పష్టంగా ఉంది. పొడవాటి నల్లటి శిరోజాల అంచున ముత్యాల్లా రాలుతున్న నీటి చుక్కలు. ఓ మూలగా ఒక రంగుల సంతకం!

Continue reading ...

సరిహద్దు

(రచన: సాయి బ్రహ్మానందం గొర్తి)

రవీ కెరీదా,

ఎలా వున్నారు? మా స్పానిష్ భాషలో కెరీదా అంటే 'ప్రియమైన' అని. నాకు అమెరికాలో వున్న అతి కొద్దిమంది పరిచయస్తుల్లో "ప్రియమైన" అని సంబోధించడానికి ఆలోచించనక్కర్లేని వ్యక్తి మీరు. అమెరికాలో నేనంటూ గౌరవించే వ్యక్తుల్లో మీరు మొదటుంటారు.

Continue reading ...

తుపాకి

(రచన: ఎస్‌. నారాయణస్వామి)

ఎడంచెయ్యి స్టీరింగ్‌ కంట్రోల్‌ చేస్తూ కుడిచెయ్యి సీటు పక్కన దరువేస్తున్నాశంకర్‌ కళ్ళు మాత్రం నిశితంగా రోడ్డుని పరిశీలిస్తున్నై. “నాన్నా,” కిరణ్‌ పిలిచాడు. దరువాగి పోయింది కొడుకు పిలుపు వినబడగానే. కానీ కళ్ళు రోడ్డు మీదనుంచి మరల్చ కుండానే మొహం కొంచెం వెనక సీటు వేపుకు తిప్పి బదులిచ్చాడు శంకర్‌. “ఏంట్రా కన్నా?”

“నాకో తుపాకీ కావాలి.”

Continue reading ...

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

Up ↑