(రచన: వేమూరి వేంకటేశ్వరరావు)
నిశీధి! నిర్మానుష్యం! నిశ్శబ్దం?
అకస్మాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఆ దుంగ ఇంటి బయట గోడని ఏదో గీకుతూన్నట్లు చప్పుడయింది. ఆ చప్పుడుకి ఒళ్ళంతా ఒక్కసారి జలదరించింది. హృదయ స్పందన లయ తప్పినట్లయింది. చలితో బయట నుండి, భయంతో లోపల నుండి ఒణుకు పుట్టుకొచ్చింది.
Continue reading ...
(రచన: సుస్మిత)
పొద్దు గుంకిపోతోంది.
ఆ పాడుబడిన దేవాలయం ఆవరణలోగడ్డి కోసుకుంటున్న పిల్లలు, గరికచెక్కలు విదిలించి, పచ్చికతో తట్టలు నింపుకుని.. ఇళ్ళదారి పట్టారు. పగలంతా తాము దాచుకున్న తిండికోసం వెతికి, పరుగులు పెట్టిన ఉడుతలు.. అలసి కలుగుల్లో చేరాయి. మునిమాపున బోసిపోయినట్టూ ఒంటరిగా మిగిలిందా కోవెల.
Continue reading ...
(రచన: మధు పెమ్మరాజు)
ఆరో క్లాసు చదువుతున్న జంగారెడ్డి పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. సాయంత్రం ఆట మొదలు పెట్టినపుడు “కొత్త కార్కు బాలు జర మెల్లగ కొట్టున్రి.” అని అందరికీ మరీమరీ చెప్పాడు. ఆ ఫుల్టాస్ పడేదాకా అంతా అతని మాట విన్నట్టే అనిపించింది. బౌలర్ చెయ్య జారడం, బాటింగ్ చేస్తున్న షాజర్ కి బాలు బదులు ఫుట్బాలు కనిపించడం అరక్షణం తేడాలో జరిగింది, మిగిలిన అరక్షణంలో బాలు తాడి చెట్టంత ఎత్తెగిరి మైదానం పక్కనున్న ముళ్ళ పొదల మధ్యన పడింది.
Continue reading ...
(రచన: యాజి)
పువ్వులే నా జీవితం, నా సంతోషం, నా సర్వస్వం. ఇలా అని నేనేదో అర్థం అయ్యీకానట్టుగా ఉండే అందమైన పదాలను పేర్చి కవిత్వం చెప్పే భావకురాలనునేరు! కాదు, కానీ నాకూ, పూలకీ, ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పాలంటే ముందు నా గతాన్ని గురించి కొంత మీరు తెలుసుకోవాలి. నా పుట్టుకతోనే నా జీవితం నిర్దేశింపబడింది, ఆ భగవంతుడికే దాసీగా ఉండిపొమ్మని. నా తల్లే నాకు గురువై, నాట్యంతో పాటు నాకు అవసరమైన అన్ని విద్యలూ తన వారసత్వంగా నాకు అందించింది. నా తండ్రి గురించి నమ్మకంగా చెప్పలేను గానీ, ఎవరో బాగా అందగాడు మాత్రం అయ్యుంటాడు, నా రూపు రేఖలూ, శరీరవర్ణమూ, నా తల్లి నుంచి మాత్రం రాలేదు, కాబట్టి.
Continue reading ...
(రచన: వేంపల్లె షరీఫ్)
చూస్తుంటే ఆ పంచాయితీ తెంచడం ఆ ఇద్దరు పెద్దమనుషుల వల్ల కూడా అయ్యేటట్టు లేదు. ఇటు చూస్తే వెంకటప్ప అటు చూస్తే సావుగొడ్లు కోసుకుని బతికే బోరేవాలా దౌలూ. నిజానికి ఆ ఇద్దరూ పెద్దమనుషులు కూడా కాదు. ఏదో కాస్త దౌలూ తోడు రమ్మంటే మొహమాటం కొద్ది వచ్చి ఇరుక్కున్నారు. దౌలూ వైపు న్యాయం ఉందన్న సంగతి వాళ్లకు అర్థమవుతోంది కానీ నోరు విప్పి ఆ మాట వెంకటప్ప ముందు చెప్పలేరు. ఇదేదో తమ గొంతుకు చుట్టుకునే వ్యవహారంలా ఉందన్న భయం కూడా వాళ్లను వెంటాడుతోంది.
Continue reading ...
(రచన: గొరుసు జగదీశ్వర రెడ్డి)
ఉదయం పదిగంటల వేళ.
బంగాళాఖాతపు దిక్చక్రం దాటి, పైకెగబాకిన సూర్యుడు విశాఖనగరానికి ఏటవాలుగా వుండి, వేడి శరాల్ని సంధించి ఒదులుతున్నాడు.
జగదాంబ జంక్షన్ హడావుడిగా తిరిగే మనుషులతో, వాహనాలతో సందడిగా వుంది. జూన్ మాసం వచ్చి రెండు వారాలు దాటినా, ఎండలు తగ్గటంలేదు. మధురవాడ నుండి పాత పోస్టాఫీసు వెళ్ళే ఇరవైఐదో నంబరు సిటీబస్సు ఆ సెంటరులో ఆగటంతో దిగింది గురమ్మ. బస్సులోంచి ఎవరో అందించిన తన పెండలందుంపల గంపని మరొకరి సహాయంతో తల మీదకెత్తుకుని, జగదాంబ సినిమాహాలు ముందున్న బస్‌స్టాపు ఎడంపక్కన తను రోజూ కూర్చుండే చోటుకి వచ్చి చేరింది.
Continue reading ...
(రచన: ఉణుదుర్తి సుధాకర్)
సుమారు ఏభై ఏళ్ల క్రిందటి మాట. అప్పట్లో వాటిని మంగలి షాపులనే అనేవాళ్ళు. అలా అనడం సరైన రాజకీయ పరిభాషాప్రయోగం కాదనే అవగాహన ఇంకా ఏర్పడలేదు. బార్బర్, హెయిర్ డ్రేసర్, సెలూన్, బుటీక్, పార్లర్ – ఈ మాటలు లేవు. క్షౌరశాల అని బోర్డుమీద రాయడమే గానీ పలికిన వాడు లేడు. మంగలి భూలోకం పెద్దకొడుకు వైకుంఠానికి చదువు అబ్బలేదు. స్కూలు తెరిచే కాలంలో కాసే నేరేడుపళ్ళతో మొదలుపెట్టి, రేగుపళ్ళూ, ఉసిరికాయలూ, సీతాఫలాలూ, చెరుకుగడలూ, ఫైనల్ పరీక్షలనాటికి మామిడికాయలూ – ఇవికాక ఏడుపెంకులాట, జురాబాలు, గోలీలాట, జీడిపిక్కలాట వీటన్నిటి మధ్య ఏర్పడ్డ దొమ్మీలో పదోతరగతి పరీక్ష చెట్టెక్కిపోయింది. చదివింది చాల్లే అని వాళ్ళ నాన్న తనకి సాయంగా దుకాణానికి రమ్మన్నాడు.
Continue reading ...
(రచన: కుప్పిలి పద్మ)
రోజ్‌వుడ్ పెయింట్ చేసిన 2 x 2 నలుచదరపు టేబుల్‌కి అటో కుర్చీ యిటో కుర్చీ. టమోటా చిల్లీ సాస్, వెనిగర్, సాల్ట్, పెప్పర్ చిన్ని చిన్ని పింగాణీ గిన్నెలతో అమర్చిన ట్రే. యుయెస్ పీజా వాసనలు. ప్లాస్టిక్ గ్లాస్‌లోని కోక్, స్పైట్ర్, థమ్సప్ చల్లదనాలు.
ఫ్లైవోవర్ మీది నుంచి యెడతెరిపి లేకుండా సాగిపోతోన్న కార్లు స్కూటర్లు, ఆటోల మధ్య బస్సులు తక్కువగానే కనిపిస్తున్నాయి. యెదురు చూస్తున్న వాహనం మాత్రం కనిపించటంలేదు.
Continue reading ...
(రచన: అఫ్సర్)
“ఆ గదిలోకి మాత్రం తొంగి అయినా చూడద్దు, బేటా!” అని కేకేస్తున్న ఫాతిమా ఫుప్మా (అత్తయ్య) గొంతే వినిపిస్తోంది ఎప్పటిదో గతంలోంచి.
“అబ్బాజాన్ కి పదో రోజు చేస్తున్నాం,” అని మునీర్ భాయ్ మూడు రోజుల క్రిందట ఫోన్ చేసినప్పటి నించీ ఆ కేక ఆ గతంలోంచి ఎన్ని సార్లు వినిపించిందో లెక్క లేదు.
Continue reading ...