(రచన: ఎం. ఎస్. కె. కృష్ణజ్యోతి)
మడిసి మట్టిలోంచి పుట్టాడని ఏదాంతం. అంకయ్యకి ఏదాంతం తెలవదు. మట్టిలోంచి మడిసి రావడం సంగతి పక్కనబెడితే ఆడికి పుడతానే మట్టితో లంకైపోయింది. మట్టిని పుట్టిన గడ్డిని కోసే కొడవలితో గూడా. ఎట్టంటావా?! అంకయ్య తల్లి లచ్చమమ్మ రేత్తిరేదో, పొద్దేదో దిక్కుతెలీని దానిలా పాటు చేస్తా వుండేది. నిండు సూలుతో గూడా దగ్గరనే గదాని పెనిమిటికి ఆన్నం ఇచ్చిరాను పొలానికి పోయ్యందా, ఆడ్నే నొప్పులొచ్చి బిడ్డ జారి బూమ్మీద పడిపోయిండు. ఏమ్మిటే చేతనున్న కొడవలితో ఆయమ్మే బొడ్డుతాడు కోసేసినాది. పురిటి బిడ్డని మొదులు చేతని పట్టుకున్న్న మంతరసాని మట్టితల్లే.
Continue reading ...
(రచన: ఎం. ఎస్. కె. కృష్ణజ్యోతి)
ఆదివారం పెద్దకూర పండగా, నాటుసార ఏడుకా గడిచిపోయాక సోమారం చెప్పుల దుకానం కాడ కూచోడం బలే కష్టమనిపిస్తది మారయ్యకి. కానీ తప్పదు. మళ్లీ వారమంతా అందరి కడుపు నిండి, వారం చివర కాసింత సరదా కావాలంటే వారమంతా ఈడ కూచుని ఎదురు చుడాలిసిందే. దుకానమంటే ఏమంత కాదుగానీ, నేలమీద రెండు గోనెలు, సుత్తీ, అరా, పెద్దసూదీ, దారం, అతికిచ్చే బంక ఇంకా నాలుగు జతల పాత చెప్పులు! ఓ చిన్న టార్పలిన్ షెడ్డు. అదీ వాన కాలం గాబట్టి ఓ మనిషి పట్టేంత చోట్లో ఎదురు కర్రలతో షెడ్డు ఏశాడు. చలికాలం ఆకాశం కిందనే. ఎండకి మాత్రం ఓ గొడుగేసుకుని నల్లని గొడుగు కింద మండతా వుంటాడు. అలవాటై పోయింది.
Continue reading ...
(రచన: అనిల్ ఎస్. రాయల్)
ఔత్సాహిక కథకులకి ప్రోత్సాహం తక్కువనీ, ఇంకోటనీ ఎలాంటి వదంతులు చెలామణిలో ఉన్నా - సాధారణంగా మన ఎడిటర్లు కొత్త కథకులని బాగా ప్రోత్సహిస్తారన్నది నా స్వీయానుభవం. కథ ఏ మాత్రం బాగున్నా దానికి సానబెట్టేందుకు విలువైన సూచనలు అందించే ఎడిటర్లున్నారు. తిప్పి పంపే కథలకి సైతం లోపాలెక్కడున్నాయో ఓపిగ్గా వివరించే ఎడిటర్లూ ఉన్నారు. మరి పై వ్యాఖ్యలకి అర్ధమేంటి? ఆయా ఎడిటర్లు సదరు కథల్ని పూర్తిగా చదవలేకపోయారని. చాలా సందర్భాల్లో దానిక్కారణం - ఆ కథ ఎత్తుగడ ఆకట్టుకునేలా లేకపోవటం.
Continue reading ...
(రచన: యాజి)
“చీకట్లో కూర్చున్నావేం?” అంటూ లైట్ స్విచ్ వేసి గదిలోకొచ్చిన రేవంత్, ప్రవల్లిక మొహం చూడంగానే, మళ్ళీ ఏమైందోనన్న ఆదుర్దాతో, సోఫాలో ఆమెపక్కనే కూర్చొని సాంత్వననివ్వటం కోసం తన చేతులు ఆమె భుజాల చుట్టూ వేసి దగ్గరకు తీసుకున్నాడు. కొంత సమయం తరవాత ప్రవల్లికే మాట్లాడటానికి పూనుకుంది.
“జెన్నీ అబార్షన్ చేయించుకుంటుందట!”
Continue reading ...
(రచన: సాయి బ్రహ్మానందం గొర్తి)
ఒక భారతీయ స్త్రీ చిన్న నేలబారు పీట మీద కూర్చొని స్నానం చేస్తున్న చిత్రం. గోడకి ఉన్న అద్దంలో అస్పష్టంగా ఆమె ముఖం; ముఖం కన్నా నుదిటి పైన మెరుస్తూ ఎర్రటి బొట్టు. వీపు మీద తడిసిన తెల్లటి వస్త్రంలో ఆమె వెనుక భాగం స్పష్టంగా ఉంది. పొడవాటి నల్లటి శిరోజాల అంచున ముత్యాల్లా రాలుతున్న నీటి చుక్కలు. ఓ మూలగా ఒక రంగుల సంతకం!
Continue reading ...
(రచన: సాయి బ్రహ్మానందం గొర్తి)
రవీ కెరీదా,
ఎలా వున్నారు? మా స్పానిష్ భాషలో కెరీదా అంటే 'ప్రియమైన' అని. నాకు అమెరికాలో వున్న అతి కొద్దిమంది పరిచయస్తుల్లో "ప్రియమైన" అని సంబోధించడానికి ఆలోచించనక్కర్లేని వ్యక్తి మీరు. అమెరికాలో నేనంటూ గౌరవించే వ్యక్తుల్లో మీరు మొదటుంటారు.
Continue reading ...
(రచన: అనిల్ ఎస్. రాయల్)
క్రితం భాగంలో ఎత్తుగడ ప్రాముఖ్యత వివరిస్తూ 'అనుభవజ్ఞులైన ఎడిటర్లు ఆరంభం చదవగానే ఆ కథ మంచీ చెడ్డా అంచనా వేయగలుగుతారు' అన్నాను. నిజానికి, అక్కడిదాకా కూడా పోకుండా కథ పేరు చూడగానే రచయిత సత్తా పసిగట్టగలిగే ఎడిటర్లూ ఉంటారు.
Continue reading ...
(రచన: ఎస్. నారాయణస్వామి)
ఎడంచెయ్యి స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ కుడిచెయ్యి సీటు పక్కన దరువేస్తున్నాశంకర్ కళ్ళు మాత్రం నిశితంగా రోడ్డుని పరిశీలిస్తున్నై. “నాన్నా,” కిరణ్ పిలిచాడు. దరువాగి పోయింది కొడుకు పిలుపు వినబడగానే. కానీ కళ్ళు రోడ్డు మీదనుంచి మరల్చ కుండానే మొహం కొంచెం వెనక సీటు వేపుకు తిప్పి బదులిచ్చాడు శంకర్. “ఏంట్రా కన్నా?”
“నాకో తుపాకీ కావాలి.”
Continue reading ...
(రచన: అనిల్ ఎస్. రాయల్)
విలక్షణమైన శీర్షిక, గొప్ప ఎత్తుగడ - ఇవి రెండూ కలిసి మీ కథని నలుగురూ చదివేలా చేస్తాయి. అంతటితో వాటి బాధ్యత తీరిపోతుంది. కథ పూర్తిగా చదివాక అది పాఠకుల మీద చెరిగిపోని ముద్ర వేయాలంటే మాత్రం ఆ కథకో గొప్ప ముగింపు అవసరం. ప్రతి కథకీ ఓ సంతృప్తికరమైన ముగింపు ఉండాలి. అంటే, కథలన్నీ తప్పకుండా సుఖాంతాలో లేక దుఃఖాంతాలో అయ్యి తీరాలని కాదు. మీ ముగింపు ఎలా ఉన్నప్పటికీ, అది పాఠకుల్ని మెప్పించాలి. దీనికి ఇదే సరైన ముగింపు అని వాళ్లని ఒప్పించాలి. అప్పుడే ఆ కథ వాళ్లకి గుర్తుండిపోతుంది.
Continue reading ...