వెతుకు

కథాలయం

An Abode For Fantastic Telugu Fiction

ట్యాగు

తెలుగు కథ

తుపాకి

(రచన: ఎస్‌. నారాయణస్వామి)

ఎడంచెయ్యి స్టీరింగ్‌ కంట్రోల్‌ చేస్తూ కుడిచెయ్యి సీటు పక్కన దరువేస్తున్నాశంకర్‌ కళ్ళు మాత్రం నిశితంగా రోడ్డుని పరిశీలిస్తున్నై. “నాన్నా,” కిరణ్‌ పిలిచాడు. దరువాగి పోయింది కొడుకు పిలుపు వినబడగానే. కానీ కళ్ళు రోడ్డు మీదనుంచి మరల్చ కుండానే మొహం కొంచెం వెనక సీటు వేపుకు తిప్పి బదులిచ్చాడు శంకర్‌. “ఏంట్రా కన్నా?”

“నాకో తుపాకీ కావాలి.”

Continue reading ...

ప్రియ శత్రువు

(రచన: అనిల్ ఎస్. రాయల్)

"అమ్మూ, నిద్రపోయే వేళయింది .. రా"

"ఇంకాసేపు ఆకుంటా మమ్మీ"

"చాలాసేపు ఆడుకున్నావు, వచ్చేయమ్మా"

"ఊఁహు. నేన్లాను. ఇంకా ఆకుంటా"

లేదా, "వత్తా కానీ, మలి నాకో కత చెబుతావా?"

లేకపోతే, "మలేం .. జోల పాడతానంటేనే వత్తా"

మరికొన్ని ప్రత్యామ్నాయాలు ఆలోచించాక విసుగొచ్చి ఆపేశాను.

కుడిచెయ్యి గుంజుతోంది. దానికేసి చూశాను. మణికట్టు వద్ద బ్యాండేజ్. ఆ చేతికేమయిందో తెలీదు. ఈ ఆసుపత్రికెలా వచ్చిపడ్డానో కూడా తెలీదు. గుర్తు చేసుకోటానికి విశ్వప్రయత్నం చేశాను. జ్ఞాపకం రాలేదు; తలనొప్పి వచ్చింది.

Continue reading ...

రహస్యం

(రచన: అనిల్ ఎస్. రాయల్)

ఈ లోకం - లోపాలూ, లోటుపాట్లూ లేనిది కాదు. అందరూ కోరుకునేంత అందమైనదీ కాదు. నలుమూలలా నేరాలు, ఘోరాలు, అవినీతి, అరాచకత్వం.

ఇది ఇంతకన్నా దారుణంగా ఉండొచ్చు.

కానీ లేదు.

లోకం ఈ మాత్రమన్నా భద్రంగా ఉండటానికి వెనక ఎందరిదో శ్రమ దాగుంది. అకుంఠిత దీక్షతో తమ పని తాము చేసుకుపోయే పాత్రికేయులు, పోలీసులు, సైనికులు, సైంటిస్టులు, మరెందరో. వాళ్ల చర్యలు అనునిత్యం ప్రపంచాన్ని కాపాడే అదృశ్యహస్తాలు. వాళ్లలో కొందరి సాహసాలు చరిత్రలకెక్కే విజయాలు. కొందరి త్యాగాలు చీకట్లలో మగ్గే రహస్యాలు.

ఇది అలాంటి ఓ మనిషి గాధ.

Continue reading ...

రీబూట్

(రచన: అనిల్ ఎస్. రాయల్)

మృత్యువు ముఖంలోకి చూస్తున్న క్షణంలో మనిషికి జీవితమంతా కళ్లముందు కదలాడుతుందంటారు.

విక్రమాదిత్యకి మాత్రం ఆఖరి అరగంటే గుర్తుకొచ్చింది.

Continue reading ...

కల్కి

(రచన: అనిల్ ఎస్. రాయల్)

"ఇద్దర్ని చంపాలి"

నిశ్సబ్దాన్ని ఛేదిస్తూ కంగుమందతని గొంతు.

నాకు పూర్తిగా మెలకువ వచ్చేసరికి ఆ గదిలో మేమిద్దరమే ఉన్నాం. తనని తాను 'మెసెంజర్'గా పరిచయం చేసుకున్నాడతను. అది అతని సంకేత నామం. అసలు పేరు తెలీదు. అడిగినా చెప్పడు. అనవసరం కూడా. అతను ఎవరి తాలూకో చెప్పకున్నా తెలుసు - ఏబీ తాలూకు. ఎవరు పడితే వాళ్లు ఇక్కడిదాకా రాలేరు. వచ్చిన వాళ్లు అత్యవసరమైతే తప్ప నన్ను నిద్రలేపరు. లేపనే లేపారు కాబట్టి, నేను లేపేయాల్సింది చాలా ముఖ్యమైనవాళ్లనే అయ్యుండాలి.

Continue reading ...

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

Up ↑