వెతుకు

కథాలయం

An Abode For Fantastic Telugu Fiction

ట్యాగు

ఎం. ఎస్. కె. కృష్ణజ్యోతి

నా నేల నాకు ఇడిసిపెట్టు సారూ …

(రచన: ఎం. ఎస్. కె. కృష్ణజ్యోతి)

మడిసి మట్టిలోంచి పుట్టాడని ఏదాంతం. అంకయ్యకి ఏదాంతం తెలవదు. మట్టిలోంచి మడిసి రావడం సంగతి పక్కనబెడితే ఆడికి పుడతానే మట్టితో లంకైపోయింది. మట్టిని పుట్టిన గడ్డిని కోసే కొడవలితో గూడా. ఎట్టంటావా?! అంకయ్య తల్లి లచ్చమమ్మ రేత్తిరేదో, పొద్దేదో దిక్కుతెలీని దానిలా పాటు చేస్తా వుండేది. నిండు సూలుతో గూడా దగ్గరనే గదాని పెనిమిటికి ఆన్నం ఇచ్చిరాను పొలానికి పోయ్యందా, ఆడ్నే నొప్పులొచ్చి బిడ్డ జారి బూమ్మీద పడిపోయిండు. ఏమ్మిటే చేతనున్న కొడవలితో ఆయమ్మే బొడ్డుతాడు కోసేసినాది. పురిటి బిడ్డని మొదులు చేతని పట్టుకున్న్న మంతరసాని మట్టితల్లే.

Continue reading ...

నేను తోలు మల్లయ్య కొడుకుని…

(రచన: ఎం. ఎస్. కె. కృష్ణజ్యోతి)

ఆదివారం పెద్దకూర పండగా, నాటుసార ఏడుకా గడిచిపోయాక సోమారం చెప్పుల దుకానం కాడ కూచోడం బలే కష్టమనిపిస్తది మారయ్యకి. కానీ తప్పదు. మళ్లీ వారమంతా అందరి కడుపు నిండి, వారం చివర కాసింత సరదా కావాలంటే వారమంతా ఈడ కూచుని ఎదురు చుడాలిసిందే. దుకానమంటే ఏమంత కాదుగానీ, నేలమీద రెండు గోనెలు, సుత్తీ, అరా, పెద్దసూదీ, దారం, అతికిచ్చే బంక ఇంకా నాలుగు జతల పాత చెప్పులు! ఓ చిన్న టార్పలిన్ షెడ్డు. అదీ వాన కాలం గాబట్టి ఓ మనిషి పట్టేంత చోట్లో ఎదురు కర్రలతో షెడ్డు ఏశాడు. చలికాలం ఆకాశం కిందనే. ఎండకి మాత్రం ఓ గొడుగేసుకుని నల్లని గొడుగు కింద మండతా వుంటాడు. అలవాటై పోయింది.

Continue reading ...

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

Up ↑