(రచన: అనిల్ ఎస్. రాయల్)
"ఈ ద్వారము తెరచిన ఎడల అమ్మవారు ఆగ్రహించును. లోకమునకు అరిష్టము దాపురించును. ఓ మానవా, వెనుకకు మరలుము"
ఆ తలుపు మీద పెద్ద అక్షరాలతో చెక్కి ఉందా హెచ్చరిక. దాని కిందా, పైనా నోళ్లు తెరుచుకుని మింగటానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెడుతున్న రెండు నాగుపాముల ఆకారాలు. వాటి కళ్ల స్థానంలో పొదిగిన జాతిరాళ్లు పై కప్పుకి వేలాడుతున్న గుడ్డి దీపం వెలుగులో మెరుస్తున్నాయి. ఆ పడగల కింద భారీ పరిమాణంలో ఉందో తుప్పు పట్టిన ఇనుప తాళం.
Continue reading ...
(రచన: అనిల్ ఎస్. రాయల్)
“ఇదిగోండి ప్రిస్క్రిప్షన్. ఏ మెడికల్ షాపులోనైనా దొరుకుతాయివి. రోజుకొక్కటే వేసుకోండి”
“మళ్లీ ఎప్పుడు రమ్మంటారు డాక్టర్?”
“రెండు నెలలు రెగ్యులర్గా ఈ మందులు వాడి చూడండి. అప్పటికీ తేడా కనిపించకపోతే ఓ సారి కలవండి. గుడ్ లక్”
ప్రిస్క్రిప్షన్ జేబులో పెట్టుకుంటూ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి బయటికొచ్చాను. పార్కింగ్ లాట్లో ఉన్న కారు దగ్గరికి నడుస్తూ సెల్ ఫోన్లో సమయం చూశాను - ఎనిమిదీ ఇరవై ఒకటి.
డోర్ తెరిచి లోపల కూర్చుంటూ సెల్ ఫోన్ పక్క సీట్లోకి విసిరి కారు స్టార్ట్ చేసి పోనిచ్చాను. హాస్పిటల్ గేట్ దగ్గరికొస్తుండగా ఫోన్ మోగింది. తలతిప్పి ఫోన్ అందుకోబోతుండగా లిప్తపాటులో జరిగిందది ....
Continue reading ...
(రచన: అనిల్ ఎస్. రాయల్)
"మీ దగ్గరో టైమ్‌మెషీన్ ఉంది. దాన్లో మీరు కాలంలో డెభ్బయ్యేళ్లు వెనక్కెళ్లి మీ తాతగారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే ఆయన్ని చంపేశారనుకుందాం. అప్పటికింకా ఆయనకి పెళ్లవలేదు కాబట్టి మీ నాన్నగారు పుట్టే అవకాశం లేదు. అంటే మీరు పుట్టే అవకాశమూ లేదన్నమాట. అప్పుడు మీరు కాలంలో వెనక్కెళ్లి మీ తాతగారిని చంపేసే అవకాశమూ లేదు. అంటే మీ తాతగారు బతికే ఉంటారు, మీ నాన్నగారూ ఉంటారు, మీరూ ఉంటారు. అప్పుడు మీరు కాలప్రయాణం చేసి మీ తాతగార్ని చంపేసే అవకాశమూ ఉంది. అంటే ...."
Continue reading ...
(రచన: అనిల్ ఎస్. రాయల్)
ఆ రోజు - అన్ని రోజుల్లాగే భళ్ళున తెల్లారింది.
ఏడున్నరకే ఎండ ఫెళ్లున కాస్తోంది. వేసవి వడగాలి ఛెళ్లున కొడుతోంది.
ఆ మాత్రానికే జనజీవితాలు స్థంభించే తీరుబడి కాలమిది కాదు కాబట్టి రహదారి మీద రద్దీ మామూలుగానే ఉంది. నేరుగా రాజధాని నగరంలోకి పోతోందా నల్లతాచులాంటి తార్రోడ్డు. దానికి ఇరువైపులా తుప్పలూ, తుమ్మలూ, రప్పలూ, రాళ్లూ తప్ప మరోటి ఉండేది కాదు. అది ఇరవయ్యేళ్లనాటి మాట. అసలా తాచు రోడ్డే లేదప్పట్లో. అప్పట్లో అదో కంకర్రోడ్డు. ఊరి శివార్లనేవాళ్లా ప్రాంతాన్ని. ఇప్పుడలా పిలిచే తలమాసినోళ్లెవరూ లేరు. ఇరవయ్యేళ్లలో తరం మారింది. లోకం మారింది. దాని పోకడ మారింది. బడులు మారాయి. పలుకుబడులు మారాయి. పలుకులు మారాయి. పిలుపులు మారాయి. సంగతులెయ్యటమాపి అసలు సంగజ్జెప్పాలంటే - అప్పటి శివార్లు సోగ్గా ఇప్పటి సబర్బ్స్ అయ్యాయి. ఇన్నేళ్లలో రాజధాని నుండి నాగరికత దేక్కుంటూ పాక్కుంటూ అక్కడిదాకా వచ్చేసింది.
Continue reading ...
(రచన: అనిల్ ఎస్. రాయల్)
"సత్యం అనేదొక స్థిర భ్రాంతి"
- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
----
చెవులు చిల్లులు పడే శబ్దం. దాన్ననుసరిస్తూ, కాలం నివ్వెరపోయినట్లు క్షణమాత్రపు నిశ్శబ్దం. మరుక్షణం మిన్నంటిన రోదనలు.
దట్టంగా పొగ. చెదురుమదురుగా మంటలు. చిందరవందరైన పరిసరాలు. ఛిద్రమైన శరీరాలు. వాటినుండి రక్తపు చుక్కలు పైకెగరసాగాయి. ఒకటి, రెండు, పది, వంద. చూస్తూండగానే చిక్కబడ్డాయవి. నేలమీంచి నింగిలోకి కుండపోతగా రుధిరవర్షం కురవసాగింది. ఆకాశాన్ని చీలుస్తూ నల్లటి మెరుపొకటి మెరిసింది. సమీపంలో పిడుగు పడింది. దిక్కులు పిక్కటిల్లిన చప్పుడుతో -
దిగ్గున మెలకువొచ్చింది.
ఎప్పుడూ వచ్చేదే. అయినా అలవాటవని కల. పదే పదే అదే దృశ్యం. మానవత్వం మాయమైన మారణహోమం. రక్తంతో రాసిన రాక్షసగీతం.
Continue reading ...
(రచన: అనిల్ ఎస్. రాయల్)
గేటు తెరుచుకున్న శబ్దానికి ఆ వృద్ధ దంపతులిద్దరూ తలెత్తి చూశారు.
ఓ యువకుడు లోపలకి అడుగుపెట్టి తిరిగి గేట్ వేస్తున్నాడు.
“మీ కోసమే అనుకుంటా” అంటూ లేచి పనున్నట్లు ఇంట్లోకి వెళ్లిందామె. విశాలమైన వరండాలో ఆయనొక్కడే మిగిలాడు.
పండుటాకులా ఉన్నాడాయన. కనబడని భారమేదో మోస్తున్నట్లు భుజాలు కిందకి ఒంగిపోయి ఉన్నాయి. కళ్లలో కాంతిపుంజాలకి బదులు బాధేదో కదలాడుతోంది. చేతిలో బాగా నలిగిపోయిన పాత పుస్తకం ఉంది. ఇరవై నాలుగో పేజ్ చదువుతున్నాడప్పుడు. ఎదురుగా కాఫీ టేబుల్. దాని మధ్యలో ఉన్న రేడియో క్లాక్ తేదీతో సహా సమయాన్ని చూపిస్తోంది. అందులో గురువారం ఉదయం తొమ్మిది గంటలయింది.
Continue reading ...
(రచన: అనిల్ ఎస్. రాయల్)
"అమ్మూ, నిద్రపోయే వేళయింది .. రా"
"ఇంకాసేపు ఆకుంటా మమ్మీ"
"చాలాసేపు ఆడుకున్నావు, వచ్చేయమ్మా"
"ఊఁహు. నేన్లాను. ఇంకా ఆకుంటా"
లేదా, "వత్తా కానీ, మలి నాకో కత చెబుతావా?"
లేకపోతే, "మలేం .. జోల పాడతానంటేనే వత్తా"
మరికొన్ని ప్రత్యామ్నాయాలు ఆలోచించాక విసుగొచ్చి ఆపేశాను.
కుడిచెయ్యి గుంజుతోంది. దానికేసి చూశాను. మణికట్టు వద్ద బ్యాండేజ్. ఆ చేతికేమయిందో తెలీదు. ఈ ఆసుపత్రికెలా వచ్చిపడ్డానో కూడా తెలీదు. గుర్తు చేసుకోటానికి విశ్వప్రయత్నం చేశాను. జ్ఞాపకం రాలేదు; తలనొప్పి వచ్చింది.
Continue reading ...
(రచన: అనిల్ ఎస్. రాయల్)
ఈ లోకం - లోపాలూ, లోటుపాట్లూ లేనిది కాదు. అందరూ కోరుకునేంత అందమైనదీ కాదు. నలుమూలలా నేరాలు, ఘోరాలు, అవినీతి, అరాచకత్వం.
ఇది ఇంతకన్నా దారుణంగా ఉండొచ్చు.
కానీ లేదు.
లోకం ఈ మాత్రమన్నా భద్రంగా ఉండటానికి వెనక ఎందరిదో శ్రమ దాగుంది. అకుంఠిత దీక్షతో తమ పని తాము చేసుకుపోయే పాత్రికేయులు, పోలీసులు, సైనికులు, సైంటిస్టులు, మరెందరో. వాళ్ల చర్యలు అనునిత్యం ప్రపంచాన్ని కాపాడే అదృశ్యహస్తాలు. వాళ్లలో కొందరి సాహసాలు చరిత్రలకెక్కే విజయాలు. కొందరి త్యాగాలు చీకట్లలో మగ్గే రహస్యాలు.
ఇది అలాంటి ఓ మనిషి గాధ.
Continue reading ...
(రచన: అనిల్ ఎస్. రాయల్)
మృత్యువు ముఖంలోకి చూస్తున్న క్షణంలో మనిషికి జీవితమంతా కళ్లముందు కదలాడుతుందంటారు.
విక్రమాదిత్యకి మాత్రం ఆఖరి అరగంటే గుర్తుకొచ్చింది.
Continue reading ...