వెతుకు

కథాలయం

An Abode For Fantastic Telugu Fiction

ట్యాగు

సైన్స్ ఫిక్షన్

ప్రళయం

(రచన: అనిల్ ఎస్. రాయల్)

"ఈ ద్వారము తెరచిన ఎడల అమ్మవారు ఆగ్రహించును. లోకమునకు అరిష్టము దాపురించును. ఓ మానవా, వెనుకకు మరలుము"

ఆ తలుపు మీద పెద్ద అక్షరాలతో చెక్కి ఉందా హెచ్చరిక. దాని కిందా, పైనా నోళ్లు తెరుచుకుని మింగటానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెడుతున్న రెండు నాగుపాముల ఆకారాలు. వాటి కళ్ల స్థానంలో పొదిగిన జాతిరాళ్లు పై కప్పుకి వేలాడుతున్న గుడ్డి దీపం వెలుగులో మెరుస్తున్నాయి. ఆ పడగల కింద భారీ పరిమాణంలో ఉందో తుప్పు పట్టిన ఇనుప తాళం.

Continue reading ...

మరో ప్రపంచం

(రచన: అనిల్ ఎస్. రాయల్)

“ఇదిగోండి ప్రిస్క్రిప్షన్. ఏ మెడికల్ షాపులోనైనా దొరుకుతాయివి. రోజుకొక్కటే వేసుకోండి”

“మళ్లీ ఎప్పుడు రమ్మంటారు డాక్టర్?”

“రెండు నెలలు రెగ్యులర్గా ఈ మందులు వాడి చూడండి. అప్పటికీ తేడా కనిపించకపోతే ఓ సారి కలవండి. గుడ్ లక్”

ప్రిస్క్రిప్షన్ జేబులో పెట్టుకుంటూ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి బయటికొచ్చాను. పార్కింగ్ లాట్లో ఉన్న కారు దగ్గరికి నడుస్తూ సెల్ ఫోన్లో సమయం చూశాను - ఎనిమిదీ ఇరవై ఒకటి.

డోర్ తెరిచి లోపల కూర్చుంటూ సెల్ ఫోన్ పక్క సీట్లోకి విసిరి కారు స్టార్ట్ చేసి పోనిచ్చాను. హాస్పిటల్ గేట్ దగ్గరికొస్తుండగా ఫోన్ మోగింది. తలతిప్పి ఫోన్ అందుకోబోతుండగా లిప్తపాటులో జరిగిందది ....

Continue reading ...

నాగరికథ

(రచన: అనిల్ ఎస్. రాయల్)

"మీ దగ్గరో టైమ్‌మెషీన్ ఉంది. దాన్లో మీరు కాలంలో డెభ్బయ్యేళ్లు వెనక్కెళ్లి మీ తాతగారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే ఆయన్ని చంపేశారనుకుందాం. అప్పటికింకా ఆయనకి పెళ్లవలేదు కాబట్టి మీ నాన్నగారు పుట్టే అవకాశం లేదు. అంటే మీరు పుట్టే అవకాశమూ లేదన్నమాట. అప్పుడు మీరు కాలంలో వెనక్కెళ్లి మీ తాతగారిని చంపేసే అవకాశమూ లేదు. అంటే మీ తాతగారు బతికే ఉంటారు, మీ నాన్నగారూ ఉంటారు, మీరూ ఉంటారు. అప్పుడు మీరు కాలప్రయాణం చేసి మీ తాతగార్ని చంపేసే అవకాశమూ ఉంది. అంటే ...."

Continue reading ...

రాక్షస గీతం

(రచన: అనిల్ ఎస్. రాయల్)

"సత్యం అనేదొక స్థిర భ్రాంతి"
- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

----

చెవులు చిల్లులు పడే శబ్దం. దాన్ననుసరిస్తూ, కాలం నివ్వెరపోయినట్లు క్షణమాత్రపు నిశ్శబ్దం. మరుక్షణం మిన్నంటిన రోదనలు.

దట్టంగా పొగ. చెదురుమదురుగా మంటలు. చిందరవందరైన పరిసరాలు. ఛిద్రమైన శరీరాలు. వాటినుండి రక్తపు చుక్కలు పైకెగరసాగాయి. ఒకటి, రెండు, పది, వంద. చూస్తూండగానే చిక్కబడ్డాయవి. నేలమీంచి నింగిలోకి కుండపోతగా రుధిరవర్షం కురవసాగింది. ఆకాశాన్ని చీలుస్తూ నల్లటి మెరుపొకటి మెరిసింది. సమీపంలో పిడుగు పడింది. దిక్కులు పిక్కటిల్లిన చప్పుడుతో -

దిగ్గున మెలకువొచ్చింది.

ఎప్పుడూ వచ్చేదే. అయినా అలవాటవని కల. పదే పదే అదే దృశ్యం. మానవత్వం మాయమైన మారణహోమం. రక్తంతో రాసిన రాక్షసగీతం.

Continue reading ...

‘టివి-99’ ఇంటర్వ్యూ

TV-99 ఛానెల్ '99-అడ్డా' కార్యక్రమం కోసం ప్రముఖ రచయిత వేంపల్లె షరీఫ్, కథకుడు అనిల్ ఎస్. రాయల్ తో జరిపిన చర్చాగోష్టి పూర్తి పాఠం.

Continue reading ...

కుంతీకుమారి

(అనువాదం: అనిల్ ఎస్. రాయల్)

(సమయం: 1985, నవంబర్ 7. రాత్రి 10:17 గంటలు. ప్రాంతం: న్యూ ఇండియా బార్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్)

బ్రాందీ గ్లాసు శుభ్రం చేస్తుండగా దానికి తగిలి ఖంగుమంది నా వేలికున్న ఉంగరం.

చేస్తున్న పని ఆపి దానికేసి చూశాను: వలయాకారంలో, తన తోకని తానే మింగుతున్న కాలసర్పం.

అప్పుడే తలుపు తెరుచుకున్న శబ్దమయింది. దృష్టి అటు మరల్చాను. కుంతీకుమారి బార్‌లోకి అడుగుపెడుతున్నాడు.

అతని వయసు పాతికేళ్లు. సరిగా నా ఎత్తుంటాడు. అనాకారి. ఆ ఆకారం నాకు నచ్చదు. కానీ అతని అవసరం నాకుంది. అందుకే అయిష్టత దాచిపెట్టుకుని అతనివైపో నవ్వు రువ్వాను. అతను తిరిగి నవ్వకుండా నేరుగా నేనున్న కౌంటర్ వద్దకే వచ్చి కుర్చీ లాక్కుని అందులో కూలబడ్డాడు.

తన గురించెవరన్నా ఆరా తీస్తే “నా పేరు కుంతి. నేనో పెళ్లికాని తల్లిని” అంటాడతను ముక్తసరిగా.

Continue reading ...

‘కినిగె’ ఇంటర్వ్యూ

వర్తమాన తెలుగు కథలపై 'కినిగె' వెబ్ పత్రిక సంపాదకుడు కథకుడు అనిల్ ఎస్. రాయల్‌ని చేసిన ఇంటర్వ్యూ.

Continue reading ...

ప్రియ శత్రువు

(రచన: అనిల్ ఎస్. రాయల్)

"అమ్మూ, నిద్రపోయే వేళయింది .. రా"

"ఇంకాసేపు ఆకుంటా మమ్మీ"

"చాలాసేపు ఆడుకున్నావు, వచ్చేయమ్మా"

"ఊఁహు. నేన్లాను. ఇంకా ఆకుంటా"

లేదా, "వత్తా కానీ, మలి నాకో కత చెబుతావా?"

లేకపోతే, "మలేం .. జోల పాడతానంటేనే వత్తా"

మరికొన్ని ప్రత్యామ్నాయాలు ఆలోచించాక విసుగొచ్చి ఆపేశాను.

కుడిచెయ్యి గుంజుతోంది. దానికేసి చూశాను. మణికట్టు వద్ద బ్యాండేజ్. ఆ చేతికేమయిందో తెలీదు. ఈ ఆసుపత్రికెలా వచ్చిపడ్డానో కూడా తెలీదు. గుర్తు చేసుకోటానికి విశ్వప్రయత్నం చేశాను. జ్ఞాపకం రాలేదు; తలనొప్పి వచ్చింది.

Continue reading ...

రహస్యం

(రచన: అనిల్ ఎస్. రాయల్)

ఈ లోకం - లోపాలూ, లోటుపాట్లూ లేనిది కాదు. అందరూ కోరుకునేంత అందమైనదీ కాదు. నలుమూలలా నేరాలు, ఘోరాలు, అవినీతి, అరాచకత్వం.

ఇది ఇంతకన్నా దారుణంగా ఉండొచ్చు.

కానీ లేదు.

లోకం ఈ మాత్రమన్నా భద్రంగా ఉండటానికి వెనక ఎందరిదో శ్రమ దాగుంది. అకుంఠిత దీక్షతో తమ పని తాము చేసుకుపోయే పాత్రికేయులు, పోలీసులు, సైనికులు, సైంటిస్టులు, మరెందరో. వాళ్ల చర్యలు అనునిత్యం ప్రపంచాన్ని కాపాడే అదృశ్యహస్తాలు. వాళ్లలో కొందరి సాహసాలు చరిత్రలకెక్కే విజయాలు. కొందరి త్యాగాలు చీకట్లలో మగ్గే రహస్యాలు.

ఇది అలాంటి ఓ మనిషి గాధ.

Continue reading ...

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

Up ↑