వెతుకు

కథాలయం

An Abode For Fantastic Telugu Fiction

ట్యాగు

వ్యాసం

3. ముగింపు

(రచన: అనిల్ ఎస్. రాయల్)

విలక్షణమైన శీర్షిక, గొప్ప ఎత్తుగడ - ఇవి రెండూ కలిసి మీ కథని నలుగురూ చదివేలా చేస్తాయి. అంతటితో వాటి బాధ్యత తీరిపోతుంది. కథ పూర్తిగా చదివాక అది పాఠకుల మీద చెరిగిపోని ముద్ర వేయాలంటే మాత్రం ఆ కథకో గొప్ప ముగింపు అవసరం. ప్రతి కథకీ ఓ సంతృప్తికరమైన ముగింపు ఉండాలి. అంటే, కథలన్నీ తప్పకుండా సుఖాంతాలో లేక దుఃఖాంతాలో అయ్యి తీరాలని కాదు. మీ ముగింపు ఎలా ఉన్నప్పటికీ, అది పాఠకుల్ని మెప్పించాలి. దీనికి ఇదే సరైన ముగింపు అని వాళ్లని ఒప్పించాలి. అప్పుడే ఆ కథ వాళ్లకి గుర్తుండిపోతుంది.

Continue reading ...

5. దృక్కోణం-2

(రచన: అనిల్ ఎస్. రాయల్)

ఉత్తమ పురుషంలో కథ 'నా' కోణం నుండి నడిస్తే, మధ్యమ పురుషంలో (second person) అది 'నీ' కోణంలో నడుస్తుంది. మరోలా చెప్పాలంటే, 'నిన్ను' ఉద్దేశించి నడుస్తుంది. ఎక్కువగా, లేఖల రూపంలో రాయబడ్డ కథల్లో ఈ విధానం కనబడుతుంది. పాఠకుడిని కూడా కథలో భాగం చేసే ఎత్తుగడ ఇది. మధ్యమ పురుషంలో నడిచే కథనం 'నువ్వు అది చెయ్యి; ఇటు తిరుగు; ఎక్కడా ఆగొద్దు; ....' ఇలా ధ్వనిస్తూ కథలా కాకుండా కరదీపికలా అగుపించే అవకాశం ఉంది.

Continue reading ...

4. దృక్కోణం-1

(రచన: అనిల్ ఎస్. రాయల్)

“సమయానికి పరీక్ష అందుకుంటానో లేదోనన్న ఆందోళనతో పరిగెత్తుకొస్తున్న బాలుడు, వాడి కోసం బయల్దేరిన బస్సుని నిలిపేసిన డ్రైవర్, అది చూసి అవతల కనెక్టింగ్ బస్ వెళ్లిపోతుందని గొడవపెడుతున్న ప్రయాణీకుడు”. ఈ మూడు పాత్రల మధ్య నడిచే డ్రామా ఆధారంగా ఓ కథ రాయాలి. ఈ కథని ఆ బాలుడు చెబితే ఎలా ఉంటుంది? డ్రైవర్ చెబితే ఎలా ఉంటుంది? ప్రయాణీకుడు చెబితే ఎలా ఉంటుంది? వీళ్లెవరూ కాక దూరం నుండి ఈ గొడవంతా గమనిస్తున్న నాలుగో వ్యక్తి చెబితే ఎలా ఉంటుంది? ఆ నాలుగో వ్యక్తి మొదటి ముగ్గుర్లో ఎవరో ఒకరి పక్షం వహించి కథ చెబితే ఎలా ఉంటుంది? పక్షపాత రహితంగా, తన సొంత అభిప్రాయాలు ఇరికించకుండా, చూసింది చూసినట్లు వర్ణిస్తే ఎలా ఉంటుంది?

Continue reading ...

6. సంభాషణలు

(రచన: అనిల్ ఎస్. రాయల్)

కథకీ వ్యాసానికీ ఉన్న ఒకే ఒక్క తేడా చెప్పమంటే మీరేమంటారో నాకు తెలీదు కానీ నేను మాత్రం 'సంభాషణలు' అంటాను. వ్యాసానికి, కథకి ఉన్న పోలిక: రెండూ పద సమూహాలే. కథల్లో సంభాషణలుంటాయి, వ్యాసాల్లో ఉండవు. రచయిత ఆలోచనలు, అభిప్రాయాలు, అవగాహన, ఆవేశం, ఆక్రోశం, ఆనందం .... ఇవన్నీ పదాలై ధారగా కాగితమ్మీదకి ప్రవహించటమే వ్యాసంలోనైనా, కథలోనైనా జరిగేది. అయితే, ఆ పదాలై సంభాషణలైతే అవి రచయిత కలం నుండి కాకుండా అతను సృష్టించిన పాత్రల నోటి నుండి ఊడిపడ్డట్లనిపిస్తూ, పాఠకుల్ని ఆ పాత్రల లోకంలోకి లాక్కుపోతాయి. అదే కథ ప్రధానోద్దేశం: చదివినంతసేపూ పాఠకుల్ని వేరే లోకంలోకి లాక్కుపోవటం.

Continue reading ...

7. పాత్రలు

(రచన: అనిల్ ఎస్. రాయల్)

శీర్షిక, ఎత్తుగడ, ముగింపు, దృక్కోణం, సంభాషణలు - ఇవన్నీ సరిగా అమరటం కథకి ఎంత ముఖ్యమో గత భాగాల్లో తెలుసుకున్నాం. అయితే అవన్నీ చాలావరకూ సాంకేతికమైనవి. వాటన్నిటికన్నా ముందు, మీ దగ్గర అసలంటూ చెప్పటానికో కథుండాలి. కథంటూ ఉంటే, అందులో ఉండి తీరాల్సినవి పాత్రలు. వాటి గురించి ఈ భాగంలో తెలుసుకుందాం.

Continue reading ...

8. నిర్మాణం

(రచన: అనిల్ ఎస్. రాయల్)

గత ఎనిమిది భాగాల్లో కథకి సంబంధించిన ఆరు అంశాలని వివరించాక, ‘కథాయణం’ చివరి ఘట్టానికి చేరింది. ఈ భాగంలో కథ నిర్మాణం ఎలా ఉండాలో చెప్పి ఈ వ్యాసావళిని ముగిస్తాను.

కథ నిర్మాణం అంటే ఏమిటి? తేలికపాటి మాటల్లో చెప్పాలంటే - మీ కథలో సంఘటనల్ని ఓ క్రమపద్ధతిలో అమర్చటమే ఆంగ్లంలో plot అనబడే ‘నిర్మాణం’.

Continue reading ...

9. మరో మాట

(రచన: అనిల్ ఎస్. రాయల్)

దీనితో 'కథాయణం' పూర్తయింది. ఇది చదివినవారికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తూ, చివరగా నాలుగు మాటలు చెబుతాను.

Continue reading ...

నూరేళ్ల సాధారణ సాపేక్షతా సిద్ధాంతం

అనాదిగా మానవుడు లోకాన్ని అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మొదట్లో దానికి సరైన దారేదో తెలీక తికమకపడ్డాడు. కళ్లకి కనబడేదే నిజమనుకున్నాడు. కనబడని శక్తుల్ని మహిమలుగా పొరబడ్డాడు, దేవుళ్లని సృష్టించాడు. అప్పట్లో అతని ప్రపంచం చిన్నది. కాలగమనంలో అతను ఎదిగాడు. లోకాన్ని లోతుగా చూడటానికో అద్భుత ప్రక్రియ కనుగొన్నాడు. అదే సైన్స్. దాని ఊతంతో అతని విశ్వం విస్తరించింది. మహిమల వెనకున్న మర్మం బోధపడింది.

దీనంతటికీ కారణం అతనికున్న ఒక విశిష్ట గుణం: ప్రశ్నించటం.

ప్రశ్నకి ప్రపంచాన్ని మార్చే శక్తుంది.

నమ్మరా? అయితే ఈ కథ చదవండి.

Continue reading ...

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

Up ↑