వెతుకు

కథాలయం

An Abode For Fantastic Telugu Fiction

ట్యాగు

తెలుగు కథ

ప్రళయం

(రచన: అనిల్ ఎస్. రాయల్)

"ఈ ద్వారము తెరచిన ఎడల అమ్మవారు ఆగ్రహించును. లోకమునకు అరిష్టము దాపురించును. ఓ మానవా, వెనుకకు మరలుము"

ఆ తలుపు మీద పెద్ద అక్షరాలతో చెక్కి ఉందా హెచ్చరిక. దాని కిందా, పైనా నోళ్లు తెరుచుకుని మింగటానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెడుతున్న రెండు నాగుపాముల ఆకారాలు. వాటి కళ్ల స్థానంలో పొదిగిన జాతిరాళ్లు పై కప్పుకి వేలాడుతున్న గుడ్డి దీపం వెలుగులో మెరుస్తున్నాయి. ఆ పడగల కింద భారీ పరిమాణంలో ఉందో తుప్పు పట్టిన ఇనుప తాళం.

Continue reading ...

భయం

(రచన: వేమూరి వేంకటేశ్వరరావు)

నిశీధి! నిర్మానుష్యం! నిశ్శబ్దం?

అకస్మాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఆ దుంగ ఇంటి బయట గోడని ఏదో గీకుతూన్నట్లు చప్పుడయింది. ఆ చప్పుడుకి ఒళ్ళంతా ఒక్కసారి జలదరించింది. హృదయ స్పందన లయ తప్పినట్లయింది. చలితో బయట నుండి, భయంతో లోపల నుండి ఒణుకు పుట్టుకొచ్చింది.

Continue reading ...

మరో ప్రపంచం

(రచన: అనిల్ ఎస్. రాయల్)

“ఇదిగోండి ప్రిస్క్రిప్షన్. ఏ మెడికల్ షాపులోనైనా దొరుకుతాయివి. రోజుకొక్కటే వేసుకోండి”

“మళ్లీ ఎప్పుడు రమ్మంటారు డాక్టర్?”

“రెండు నెలలు రెగ్యులర్గా ఈ మందులు వాడి చూడండి. అప్పటికీ తేడా కనిపించకపోతే ఓ సారి కలవండి. గుడ్ లక్”

ప్రిస్క్రిప్షన్ జేబులో పెట్టుకుంటూ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి బయటికొచ్చాను. పార్కింగ్ లాట్లో ఉన్న కారు దగ్గరికి నడుస్తూ సెల్ ఫోన్లో సమయం చూశాను - ఎనిమిదీ ఇరవై ఒకటి.

డోర్ తెరిచి లోపల కూర్చుంటూ సెల్ ఫోన్ పక్క సీట్లోకి విసిరి కారు స్టార్ట్ చేసి పోనిచ్చాను. హాస్పిటల్ గేట్ దగ్గరికొస్తుండగా ఫోన్ మోగింది. తలతిప్పి ఫోన్ అందుకోబోతుండగా లిప్తపాటులో జరిగిందది ....

Continue reading ...

నాగరికథ

(రచన: అనిల్ ఎస్. రాయల్)

"మీ దగ్గరో టైమ్‌మెషీన్ ఉంది. దాన్లో మీరు కాలంలో డెభ్బయ్యేళ్లు వెనక్కెళ్లి మీ తాతగారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే ఆయన్ని చంపేశారనుకుందాం. అప్పటికింకా ఆయనకి పెళ్లవలేదు కాబట్టి మీ నాన్నగారు పుట్టే అవకాశం లేదు. అంటే మీరు పుట్టే అవకాశమూ లేదన్నమాట. అప్పుడు మీరు కాలంలో వెనక్కెళ్లి మీ తాతగారిని చంపేసే అవకాశమూ లేదు. అంటే మీ తాతగారు బతికే ఉంటారు, మీ నాన్నగారూ ఉంటారు, మీరూ ఉంటారు. అప్పుడు మీరు కాలప్రయాణం చేసి మీ తాతగార్ని చంపేసే అవకాశమూ ఉంది. అంటే ...."

Continue reading ...

బౌండరీ దాటిన బాలు

(రచన: మధు పెమ్మరాజు)

ఆరో క్లాసు చదువుతున్న జంగారెడ్డి పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. సాయంత్రం ఆట మొదలు పెట్టినపుడు “కొత్త కార్కు బాలు జర మెల్లగ కొట్టున్రి.” అని అందరికీ మరీమరీ చెప్పాడు. ఆ ఫుల్టాస్ పడేదాకా అంతా అతని మాట విన్నట్టే అనిపించింది. బౌలర్ చెయ్య జారడం, బాటింగ్ చేస్తున్న షాజర్ కి బాలు బదులు ఫుట్బాలు కనిపించడం అరక్షణం తేడాలో జరిగింది, మిగిలిన అరక్షణంలో బాలు తాడి చెట్టంత ఎత్తెగిరి మైదానం పక్కనున్న ముళ్ళ పొదల మధ్యన పడింది.

Continue reading ...

పగడ మల్లెలు

(రచన: యాజి)

పువ్వులే నా జీవితం, నా సంతోషం, నా సర్వస్వం. ఇలా అని నేనేదో అర్థం అయ్యీకానట్టుగా ఉండే అందమైన పదాలను పేర్చి కవిత్వం చెప్పే భావకురాలనునేరు! కాదు, కానీ నాకూ, పూలకీ, ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పాలంటే ముందు నా గతాన్ని గురించి కొంత మీరు తెలుసుకోవాలి. నా పుట్టుకతోనే నా జీవితం నిర్దేశింపబడింది, ఆ భగవంతుడికే దాసీగా ఉండిపొమ్మని. నా తల్లే నాకు గురువై, నాట్యంతో పాటు నాకు అవసరమైన అన్ని విద్యలూ తన వారసత్వంగా నాకు అందించింది. నా తండ్రి గురించి నమ్మకంగా చెప్పలేను గానీ, ఎవరో బాగా అందగాడు మాత్రం అయ్యుంటాడు, నా రూపు రేఖలూ, శరీరవర్ణమూ, నా తల్లి నుంచి మాత్రం రాలేదు, కాబట్టి.

Continue reading ...

శిక్ష

(రచన: అనిల్ ఎస్. రాయల్)

ఆ రోజు - అన్ని రోజుల్లాగే భళ్ళున తెల్లారింది.

ఏడున్నరకే ఎండ ఫెళ్లున కాస్తోంది. వేసవి వడగాలి ఛెళ్లున కొడుతోంది.

ఆ మాత్రానికే జనజీవితాలు స్థంభించే తీరుబడి కాలమిది కాదు కాబట్టి రహదారి మీద రద్దీ మామూలుగానే ఉంది. నేరుగా రాజధాని నగరంలోకి పోతోందా నల్లతాచులాంటి తార్రోడ్డు. దానికి ఇరువైపులా తుప్పలూ, తుమ్మలూ, రప్పలూ, రాళ్లూ తప్ప మరోటి ఉండేది కాదు. అది ఇరవయ్యేళ్లనాటి మాట. అసలా తాచు రోడ్డే లేదప్పట్లో. అప్పట్లో అదో కంకర్రోడ్డు. ఊరి శివార్లనేవాళ్లా ప్రాంతాన్ని. ఇప్పుడలా పిలిచే తలమాసినోళ్లెవరూ లేరు. ఇరవయ్యేళ్లలో తరం మారింది. లోకం మారింది. దాని పోకడ మారింది. బడులు మారాయి. పలుకుబడులు మారాయి. పలుకులు మారాయి. పిలుపులు మారాయి. సంగతులెయ్యటమాపి అసలు సంగజ్జెప్పాలంటే - అప్పటి శివార్లు సోగ్గా ఇప్పటి సబర్బ్స్ అయ్యాయి. ఇన్నేళ్లలో రాజధాని నుండి నాగరికత దేక్కుంటూ పాక్కుంటూ అక్కడిదాకా వచ్చేసింది.

Continue reading ...

రాక్షస గీతం

(రచన: అనిల్ ఎస్. రాయల్)

"సత్యం అనేదొక స్థిర భ్రాంతి"
- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

----

చెవులు చిల్లులు పడే శబ్దం. దాన్ననుసరిస్తూ, కాలం నివ్వెరపోయినట్లు క్షణమాత్రపు నిశ్శబ్దం. మరుక్షణం మిన్నంటిన రోదనలు.

దట్టంగా పొగ. చెదురుమదురుగా మంటలు. చిందరవందరైన పరిసరాలు. ఛిద్రమైన శరీరాలు. వాటినుండి రక్తపు చుక్కలు పైకెగరసాగాయి. ఒకటి, రెండు, పది, వంద. చూస్తూండగానే చిక్కబడ్డాయవి. నేలమీంచి నింగిలోకి కుండపోతగా రుధిరవర్షం కురవసాగింది. ఆకాశాన్ని చీలుస్తూ నల్లటి మెరుపొకటి మెరిసింది. సమీపంలో పిడుగు పడింది. దిక్కులు పిక్కటిల్లిన చప్పుడుతో -

దిగ్గున మెలకువొచ్చింది.

ఎప్పుడూ వచ్చేదే. అయినా అలవాటవని కల. పదే పదే అదే దృశ్యం. మానవత్వం మాయమైన మారణహోమం. రక్తంతో రాసిన రాక్షసగీతం.

Continue reading ...

జగదాంబ జంక్షన్‌

(రచన: గొరుసు జగదీశ్వర రెడ్డి)

ఉదయం పదిగంటల వేళ.

బంగాళాఖాతపు దిక్చక్రం దాటి, పైకెగబాకిన సూర్యుడు విశాఖనగరానికి ఏటవాలుగా వుండి, వేడి శరాల్ని సంధించి ఒదులుతున్నాడు.

జగదాంబ జంక్షన్‌ హడావుడిగా తిరిగే మనుషులతో, వాహనాలతో సందడిగా వుంది. జూన్‌ మాసం వచ్చి రెండు వారాలు దాటినా, ఎండలు తగ్గటంలేదు. మధురవాడ నుండి పాత పోస్టాఫీసు వెళ్ళే ఇరవైఐదో నంబరు సిటీబస్సు ఆ సెంటరులో ఆగటంతో దిగింది గురమ్మ. బస్సులోంచి ఎవరో అందించిన తన పెండలందుంపల గంపని మరొకరి సహాయంతో తల మీదకెత్తుకుని, జగదాంబ సినిమాహాలు ముందున్న బస్‌స్టాపు ఎడంపక్కన తను రోజూ కూర్చుండే చోటుకి వచ్చి చేరింది.

Continue reading ...

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

Up ↑